Ind Vs Zim: తొలి వన్డేలో అదరగొట్టిన భారత బౌలర్లు.. 189 పరుగులకు జింబాబ్వే ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind Vs Zim: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తర్వాత పట్టు సడలించారు. దీంతో జింబాబ్వే టెయిలెండర్లు రాణించారు. సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. మూడు వికెట్లతో సత్తా చాటడంతో జింబాబ్వే 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు ఓపెనర్లు ఇన్నోసెండ్ కియా(4), మారుమని(8), వెస్లీ మధెవెరె(5)లను చాహర్ పెవిలియన్ చేర్చాడు.
Read Also: Thiru Movie review : తిరు రివ్యూ
Also Read
- Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
- IND vs NZ: న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. ఆ ఇద్దరు స్టార్స్ దూరం!
- IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
- ECB: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
అయితే జింబాబ్వే ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత భారత బౌలర్లు పట్టు సడలించారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా.. కెప్టెన్ చకబ్వా 35, గరవా 34, ఎవాన్స్ 33 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్ ఒక వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ 190 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో భారత్ నలుగురు ఓపెనర్లతో బరిలోకి దిగింది. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషాన్ వంటి ఓపెనింగ్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌కు వచ్చి రాహుల్, ఇషాన్ కిషాన్ మిడిలార్డర్లో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా రాహుల్ త్రిపాఠిని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ త్రిపాఠిని ఐర్లాండ్ పర్యటనకు కూడా ఎంపిక చేసి ఇలానే ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వలేదని, రుతురాజ్‌ను సైతం చాలా రోజులుగా తుది జట్టులోకి తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
-
Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
-
Off The Record: సూర్యాపేట కాంగ్రెస్ ను ముంచుతున్న గ్రూప్ వార్..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!