Ind Vs Zim: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తర్వాత పట్టు సడలించారు. దీంతో జింబాబ్వే టెయిలెండర్లు రాణించారు. సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లోనే సత్తా…