IND vs NZ: న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. ఆ ఇద్దరు స్టార్స్ దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Team News: భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన కివీస్‌కు మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు బ్లెయిర్ టిక్నర్ ఐసీసీ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఏడు రోజుల విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో.. మూడో, నాలుగో వన్డేలకు దూరమయ్యాడు. అతడి స్థానంలో క్రిస్టియన్ క్లార్క్‌ను జట్టులోకి తీసుకున్నారు. నవంబర్ 10న హామిల్టన్‌లో మూడో వన్డే జరగనుండగా.. వరుసగా రెండు ఓటముల తర్వాత ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని కివీస్ భావిస్తోంది.
ఈ సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్‌కు గాయాల సమస్య వేధిస్తోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బ్లెయిర్ టిక్నర్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. అయితే వైద్య పరీక్షల్లో అతడికి కంకషన్ లేదని నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీంతో అతడు మూడో, నాలుగో వన్డేల్లో ఆడే అవకాశం లేదు. వెల్లింగ్టన్లో వర్షం కారణంగా అంతరాయం కలిగిన రెండో వన్డే రెండో భాగంలో టిక్నర్ స్థానంలో మాట్ ఫిషర్ బరిలోకి దిగాడు. టిక్నర్ తొలి వన్డేలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి నాలుగు సిక్సర్లు బాదాడు.
Also Read
- IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
- ECB: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
- Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
టిక్నర్ స్థానంలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఫాస్ట్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్‌కు జట్టులో చోటు కల్పించారు. ఇటీవల ఫోర్డ్ ట్రోఫీలో ఆడిన అతడు.. భారత్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ ఏ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. నాలుగు రోజుల సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటింగ్‌లో 42, 41 పరుగులు చేశాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్ తరఫున నాలుగు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. మరోవైపు లాకీ ఫెర్గూసన్ కుడి కాలి కండరానికి అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్ సమయంలో అతడికి కండరాల్లో స్వల్ప చీలిక ఏర్పడింది. దీంతో నాలుగో, ఐదో వన్డేలకు అతడు అందుబాటులో ఉండడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
మాట్ హెన్రీ విషయంలోనూ వైద్య బృందం ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఆక్లాండ్‌లో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్ సమయంలో డెవాన్ కాన్వేతో ఢీకొన్న హెన్రీకి తొలుత కంకషన్ లేదని వైద్యులు నిర్ధారించారు. అయితే రెండో టీ20 మ్యాచ్ సమయంలో అతడి కుడి తొడ కండరానికి స్వల్ప గాయమైంది. వెల్లింగ్టన్లో మరోసారి పరీక్షించిన వైద్య బృందం.. నాలుగో వన్డే నాటికి తిరిగి జట్టులోకి వస్తాడని భావిస్తోంది. హెన్రీతో పాటు కైల్ జేమీసన్ కూడా వన్డే జట్టుతోనే కొనసాగనున్నారు. వాస్తవానికి మూడో వన్డే తర్వాత వీరిద్దరూ టెస్టు సిరీస్ సన్నాహాల కోసం జట్టును వీడాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుతోనే ఉండనున్నారు.
మూడో వన్డేకు న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్.
నాలుగో వన్డేకు న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచెల్ హే (వికెట్ కీపర్), మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), విల్ యంగ్.
తాజావార్తలు
-
IND vs NZ: న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. ఆ ఇద్దరు స్టార్స్ దూరం!
-
Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్‌కు బ్రేక్ పడినట్లేనా..!
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
-
Diwali: దీపావళి గాయాలు.. ఆస్పత్రులకు తెలుగు రాష్ట్రాలు క్యూ..!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!