IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే చాలా మంది అభిమానులు మ్యాచ్‌లను టీవీ, మొబైల్లో చూసేందుకు ప్రత్యేక రీఛార్జ్ లేదా సబ్స్క్రిప్షన్ అవసరమవుతుందా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసం భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా..? అవునండి.. మీరు చదివింది నిజమే.. మరి ఎక్కడ..? ఎప్పుడు..? చూడాలంటే..
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ నవంబర్ 10, మంగళవారం హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందు అంటే ఉదయం 7 గంటలకు టాస్ పడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ ప్రత్యక్ష ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ వద్ద ఉన్నాయి. టీవీలో సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 3 హిందీ, సోనీ స్పోర్ట్స్ 4 ప్రాంతీయ భాషా ఛానళ్లలో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లలో SonyLIV యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. అయితే SonyLIVలో మ్యాచ్ చూసేందుకు తగిన సబ్స్క్రిప్షన్ అవసరం.
Also Read
- Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
- Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
- Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్‌కు బ్రేక్ పడినట్లేనా..!
- Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
అయిపోతే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా చూడాలనుకునే వారికి డీడీ స్పోర్ట్స్ మంచి అవకాశం. మీ ఇంట్లో DD ఫ్రీ డిష్ కనెక్షన్ ఉంటే DD స్పోర్ట్స్ ఛానల్లో మూడో వన్డే మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. దీనికి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో మిగిలిన వన్డే మ్యాచ్‌లను కూడా DD స్పోర్ట్స్ ద్వారా ఉచితంగా చూడవచ్చు.
అయితే కేబుల్ టీవీ లేదా ఇతర DTH సర్వీసులు ఉపయోగిస్తున్న వారికి ఇదే విధంగా ఉచిత ప్రసారం అందుబాటులో ఉంటుందని చెప్పలేం. ఉచితంగా మ్యాచ్ చూడాలంటే DD Free Dish కనెక్షన్ ఉండాలి.తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా.. ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కొనసాగుతోంది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. మరోవైపు హామిల్టన్‌లో వర్షం పడే అవకాశం ఉండటం మ్యాచ్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. మూడో వన్డే ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI:
మిచెల్ సాంట్నర్ (C), మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్.
భారత ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (C), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (WK), నామన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
తాజావార్తలు
-
Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
-
Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
-
IND vs NZ: న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. ఆ ఇద్దరు స్టార్స్ దూరం!
-
Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్‌కు బ్రేక్ పడినట్లేనా..!
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!