Virat Kohli Slams 76th International Century In His 500th Game: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. 2018 డిసెంబర్ నుంచి టెస్టుల్లో సెంచరీ చేయని విరాట్.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత శతక్కొట్టాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌లో సెంచరీ కొట్టిన కోహ్లీ.. అప్పటి నుంచి విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీ చేయనే చేయలేదు. ఇప్పుడు వెస్టిండీస్ టూర్‌లో భాగంగా ఆ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో శతకం చేశాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో.. 181 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో కోహ్లీ తన సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 76వ అంతర్జాతీయ సెంచరీ. తన 500వ మ్యాచ్‌లో కోహ్లీ ఈ శతకం బాదడం మరింత విశేషంగా నిలిచింది.
హే జాక్.. యూ ఆర్ సో హాట్.. నీ అందాలకు కుర్రాళ్లు ఏమైపోవాలి..
87 వ్యక్తిగత పరుగులతో రెండో రోజు ఆటని ప్రారంభించిన కోహ్లీ.. నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. సరిగ్గా 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. ఫోర్ కొట్టి సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. ఆపై కాస్త జోరు పెంచాలని భావించాడు. కానీ.. 121 వ్యక్తిగత పరుగుల వద్ద కోహ్లీ రనౌట్ అయ్యాడు. అల్జారీ జోసెఫ్ అతడ్ని రనౌట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు లంచ్ సమయం కల్లా భారత్ 108 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లీ శతక్కొట్టడంతో పాటు ఓపెనర్లు అర్థశతకాలతో అద్భుతంగా రాణించడం, జడేజా సైతం హాఫ్ సెంచరీతో చెలరేగడంతో.. భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.
Extramarital Affair: భర్త అప్పు చేసి చదివిస్తే.. ఉద్యోగం వచ్చాక భార్య మరొకరితో ఎఫైర్