Site icon NTV Telugu

IND vs SA 1st ODI: రేపే సౌతాఫ్రికాతో భారత్ తొలి వన్డే.. తుది జట్టు ఇదే!

Kl

Kl

IND vs SA 1st ODI: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు అదే జట్టుతో 3 వన్డేల సిరీస్‌కు భారత్ సిద్ధం అవుతోంది. రేపు (నవంబర్ 30న) రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది. అయితే, గాయంతో శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో కెప్టెన్ గా కేఎల్ రాహుల్‌ను టీం యాజమాన్యం ఎంపిక చేసింది. అయితే, గిల్ స్థానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌తో పోలిస్తే జైస్వాల్‌ కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. యశస్వి ఇప్పటి వరకు ఒక్క వన్డే మాత్రమే ఆడాడు.. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్‌లో ఎంపికైనప్పటికీ ఫ్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం లభించలేదు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..

అయితే, విరాట్ కొహ్లీ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో వరుసగా సున్నా పరుగులకే పెవిలియన్ కు చేరుకున్నప్పటికీ, మూడో వన్డేలో అర్థ శతకంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అతడు మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. శ్రేయస్ అయ్యార్ లేకపోవడంతో నాలుగో స్థానానికి రిషబ్ పంత్, తిలక్ వర్మ మధ్య పోటీ కొనసాగుతుంది. కెప్టెన్ రాహుల్ వికెట్ కీపర్ కావడంతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన తిలక్ వర్మను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, 5వ స్థానంలో కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలలో ఎవరిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారో అనేది చూడాలి.. కాగా, ఆసీస్‌తో సిరీస్‌లో కేవలం ఒక్క మ్యాచ్ ఆడిన కుల్దీప్ యాదవ్ ఈసారి సఫారీతో జరిగే 3 వన్డేలలో ఆడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ దళానికి నాయకత్వం వహించనున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ఉన్నప్పటికీ అతడు ఫ్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కించుకోకపోవచ్చు..

Read Also: Smriti and Palash: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఒకే ఎమోజీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

టీమిండియా ఫ్లేయింగ్ ఎలెవన్‌
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్

Exit mobile version