Smriti and Palash: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఒకే ఎమోజీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
- స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లికి లైన్ క్లియర్..
- ఇన్‌స్టా అకౌంట్లో దిష్ట రక్ష ఎమోజీని పోస్టు చేసిన ఇరువురు..
- త్వరలోనే స్మృతి- పలాశ్ పెళ్లి జరగబోతుందని సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti and Palash: టీమిండియా మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో వారు వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారానికి స్మృతి-పలాశ్ దిష్టి రక్ష ఎమోజీతో చెక్ పెట్టేశారు. వారిద్దరూ తాజాగా తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో దిష్టి రక్ష ఎమోజీని యాడ్ చేశారు. దీంతో వారి మధ్య ఎలాంటి గొడవలు లేవనే విషయంపై క్లారిటీ ఇచ్చినట్లైంది.
Read Also: Off The Record: హిల్ట్ పాలసీపై ఎంపీలు రియాక్ట్ అవకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయా ?
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
అయితే, ఇటీవల స్మృతి మంధాన ఇన్‌స్టా్గ్రామ్ ఖాతాలో పెళ్లికి సంబంధించిన పోస్టులు మాయం కావడంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. పలాశ్ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తూ.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపిస్తూ స్మృతి పోస్టు చేసిన వీడియో ఆమె ఇన్‌స్టా అకౌంట్ లో కనిపించలేదు. ఇదే వీడియోను స్మృతి ఫ్రెండ్స్ జెమీమా రోడిక్స్, శ్రేయాంకలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో పలాశ్‌కు, ఆమెకు మధ్య మనస్పర్థలు వచ్చాయనే న్యూస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగింది. అదే సమయంలో పలాశ్ ముచ్చల్ మరో అమ్మాయితో మంధానను కించపరిచేలా చాట్ చేసినట్లు ఆరోపిస్తున్న స్క్రీన్‌షాట్లు ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్ష్యం కావడంతో వైరల్‌గా మారింది.
Read Also: Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్
ఇక, శుక్రవారం నాడు పలాశ్ ముచ్చల్ తల్లి అమిత ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ.. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. త్వరలో పలాశ్ ముచ్చల్- స్మృతి మంధాన వివాహం జరుగుతుందని తేల్చి చెప్పింది. స్మృతి, పలాశ్ ఇద్దరూ ప్రస్తుతం కష్టాల్లోనే ఉన్నారు. స్మృతిని తన అర్థంగిగా త్వరలోనే మా ఇంటికి తీసుకురావాలని పలాశ్ కలలు కన్నాడు.. నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను.. ఇప్పుడంతా బాగానే ఉంది.. వారిద్దరి పెళ్లి అతి త్వరలో జరగబోతుందని ఆమె వెల్లడించారు. ఈ సమయంలో స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ తమ ఇన్‌స్టా బయోలో దిష్ట రక్ష ఎమోజీని పోస్టులను అప్‌డేట్ చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?