Team India New Jersey: టీ20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీ.. స్టోర్, ఆన్‌లైన్‌లో లభ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adidas unveiled Team India New Jersey ahead of T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టును బీసీసీఐ గత వారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని చూస్తోంది. జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ ట్రోఫీ వేట ప్రారంభించనుంది.
టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని బీసీసీఐ ఈరోజు ధర్మశాలలో ఆవిష్కరించింది. స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం, భారత క్రికెట్ జట్టు అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ కొత్త జెర్సీకి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోలో కొత్త ఇండియా కిట్‌తో ఓ హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగురుతుండగా.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చుస్తున్నారు. జెర్సీలో భుజాలు నారింజ రంగులో ఉండగా.. మిగిలిన భాగం నీలం రంగులో ఉంది. ఇక అడిడాస్ ఐకానిక్ మూడు చారలు తెలుపు రంగులో భుజాలపై ఉన్నాయి.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Asha Sobhana Debut: 13 ఏళ్ల వయస్సులో క్రికెట్ వైపు అడుగులు.. 33 ఏళ్లకు భారత జట్టులో అరంగేట్రం!
భారత్ కొత్త కిట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడిడాస్ పోస్ట్ చేసిన వీడియోను బీసీసీఐ రీ ట్వీట్ చేసింది. ‘ఒక జెర్సీ. వన్ నేషన్. టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమిండియా కొత్త టీ20 జెర్సీని ప్రజెంట్ చేశాం. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు అడిడాస్ స్టోర్‌లలో మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి’ అని బీసీసీఐ పేర్కొంది.
One jersey. One Nation.
Presenting the new Team India T20 jersey.Available in stores and online from 7th may, at 10:00 AM. pic.twitter.com/PkQKweEv95
— adidas (@adidas) May 6, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు