South Africa vs West Indies: సెమీస్‌కు దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ ఇంటికి! ఇక మిగిలింది గ్రూప్1
- సెమీస్‌కు దక్షిణాఫ్రికా
- ఇంటికి వెస్టిండీస్
- గ్రూప్1 సెమీస్ జట్లేవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa Reach T20 World Cup 2024 Semis After Beat West Indies: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. యూఎస్‌ఏపై విజయం సాధించిన ఇంగ్లండ్ ఒక బెర్తును దక్కించుకోగా.. వెస్టిండీస్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా మరో బెర్తును ఖరారు చేసుకుంది. దాంతో టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశాలు (యూఎస్‌ఏ, వెస్టిండీస్) ఇంటిదారి పట్టాయి. సూపర్-8 దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలవగా.. ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లలో గెలిచింది. ఇక గ్రూప్1 సెమీస్ జట్లేవో తేలాల్సి ఉంది. ఇవాళ జరిగే భారత్-ఆస్ట్రేలియా, అఫ్గాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లతో ఫలితం తేలనుంది.
సెమీస్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విండీస్ చివరివరకూ పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. విండీస్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రొటీస్ ఇబ్బంది పడింది. ఛేదన ఆరంభమైన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించి.. టార్గెట్‌ను 124 పరుగులుగా నిర్దేశించారు. చివరికి 16.1 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి సఫారీలు విజయం సాధించారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు డికాక్ (12), హెడ్రిక్స్ (0) అవుట్ అయినా.. ట్రిస్టన్ స్టబ్స్ (29), క్లాసెన్ (22) జట్టును ఆదుకున్నారు. జాన్సెన్ (21 నాటౌట్), మార్‌క్రమ్ (18) రాణించారు. చివరి ఓవర్‌లో ఐదు పరుగులు అవసరం కాగా.. రబాడ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లు తీశాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Tollywood Producers: స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరంకు టాలీవుడ్ బడా నిర్మాతలు.. ఎందుకో తెలుసా?
అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (52) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కేల్ మయేర్స్ (35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హోప్ (0), పూరన్ (1), పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0) నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసీ 3 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన షంసీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!