Scotland vs Italy: స్కాట్లాండ్ భారీ విజయం.. కట్ చేస్తే పాయింట్ల పట్టికలో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scotland vs Italy: టీ20 ప్రపంచకప్ 2026 ఆదిలోనే సంచలనాలకు వేదికగా మారేందుకు సిద్ధమైంది. ఈ పోరు గ్రూప్-C లో మరింత ఆసక్తికరంగా మారింది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు ఇటలీపై ఏకంగా 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో సంచలనం సృష్టించింది. ఈ విజయంతో స్కాట్లాండ్ గ్రూప్-Cలో ఇంగ్లాండ్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన స్కాట్లాండ్, తర్వాతి మ్యాచ్ లో మంచి ప్రదర్శనతో తిరిగి పోటీలో నిలిచింది. ప్రస్తుతం గ్రూప్-Cలో వెస్టిండీస్ +1.75 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉండగా.. స్కాట్లాండ్ +0.95 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో నిలిచింది. ఇక మరోవైపు ఒక విజయం సాధించిన ఇంగ్లాండ్ నెట్ రన్‌రేట్ పరంగా వెనుకబడి ఉంది. ఇక గ్రూప్-Cలో తర్వాత మ్యాచ్ లో స్కాట్లాండ్-ఇంగ్లాండ్ తలపడుతుంది. దీనితో ఈ గ్రూప్ భవిష్యత్తు తేలనుంది.

ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో జార్జ్ మున్సే 54 బంతుల్లో 84 పరుగులు చేసి భారీ స్కోర్ కు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా మైఖేల్ జోన్స్ 37 పరుగులు చేయగా, బ్రెండన్ మెక్‌ముల్లెన్ 18 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. చివర్లో మైఖేల్ లీస్క్ కేవలం 5 బంతుల్లో 22 పరుగులు చేసి స్కోరును భారీగా పెంచేసాడు.
Assam CM Controversy: అస్సాం సీఎంపై హైదరాబాద్‌లో కేసు.. రంగంలోకి అసదుద్దీన్ ఓవైసీ!
లక్ష్యచేదనలో ఇటలీ జట్టు 16.4 ఓవర్లలో కేవలం 134 పరుగులకు ఆలౌట్ అయింది. వీరి ఇన్నింగ్స్ లో బూమానెట్టి 31 బంతుల్లో 52 పరుగులు, హ్యారీ మానెట్టి 37 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. స్కాట్లాండ్ తరఫున మైఖేల్ లీస్క్ 17 పరుగులకు 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో స్కాట్లాండ్ జట్టు నాకౌట్ అవకాశాలను బలపరుచుకుంది. ఇంగ్లాండ్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్ గ్రూప్-Cలో కీలకంగా మారింది.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!