SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి!
- టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్
- మ్యాచ్ టై అయ్యి రెండు సూపర్ ఓవర్లకు దారి
- డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో దక్షిణాఫ్రికా విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs AFG: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-Dలో భాగంగా అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠకు గురిచేసేలా హైడ్రామా నడిచింది. చివరకు మ్యాచ్ ఫలితం కోసం రెండు సూపర్ ఓవర్లు సాగిన థ్రిల్లర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో రియన్ రికెల్టన్ (61), క్వింటన్ డీకాక్ (59) అద్భుతంగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. చివర్లో మార్కో జాన్సెన్ వేగంగా 16 పరుగులు చేయడంతో స్కోరు 180 దాటింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనలో ఆఫ్ఘానిస్తాన్ కూడా సమానంగా పోరాడింది. రహ్మానుల్లా గుర్బాజ్ 42 బంతుల్లో 84 పరుగులు చేసి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాడు. మధ్యలో వరుస వికెట్లు పడినా చివరి ఓవర్లలో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కీలక పరుగులు చేయడంతో ఆఫ్ఘానిస్తాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. దీనితో ఈ ప్రపంచకప్ లో మొదటి మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది.
TGSRTC: మహా శివరాత్రికి 2243 ప్రత్యేక బస్సులు.. పకడ్బందీగా ఏర్పాట్లు!
మొదటి సూపర్ ఓవర్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ 17 పరుగులు చేసింది. దీనికి బదులుగా దక్షిణాఫ్రికా కూడా అదే స్థాయిలో 17 పరుగులు చేయడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. దీనితో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇక రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ భారీ షాట్లతో 23 పరుగులు సాధించారు. ఆఫ్ఘానిస్తాన్ రెండో సూపర్ ఓవర్ లో 24 లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కేశవ్ మహారాజ్ స్పిన్ మాయాజాలంతో రెండు వికెట్లు తీసి కేవలం 19 పరుగులకే పరిమితం చేశాడు. అయితే మూడు వరుస సిక్సర్లతో రహ్మనుల్లాహ్ గర్భాజ్ దక్షిణాఫ్రికాకు ముచ్చెమటలు పట్టించాడు. కానీ విజయం దక్షిణాఫ్రికా వైపు నిలిచింది. రెండు సూపర్ ఓవర్లు సాగిన ఈ రసవత్తర పోరు క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!