El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
- ఎల్‌నినో ప్రభావంపై రైతులతో నేరుగా చర్చ
- వర్షపాతం లోటును ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు
- ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సూచనలు
- శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తబోయే వాతావరణ మార్పులు, వర్షపాత లోటు , వ్యవసాయ రంగంపై పడబోయే సంభావ్య ప్రభావాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సంబంధిత మంత్రులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు.
రైతులతో నేరుగా మమేకం.. ముందస్తు అవగాహనకు పెద్దపీట
సాధారణంగా ఎదురయ్యే వాతావరణ సవాళ్లను అధిగమించే దిశగా ప్రభుత్వం ఈ వినూత్న సంభాషణకు శ్రీకారం చుట్టింది. రైతు వేదికల ద్వారా నేరుగా అన్నదాతలతో అనుసంధానమవుతూ ప్రస్తుత సాగు పరిస్థితులు, తాగు-సాగు నీటి లభ్యతపై ఆరా తీస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో ఏర్పడే ఇబ్బందులను ముందే గుర్తించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు నివారణ చర్యలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా వర్షపాతం లోటును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికలను రూపొందించడంపై రైతులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Also Read
- Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఎప్పటికప్పుడు తగిన వ్యవసాయ మార్గదర్శకాలు అందించాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంపై పడే ప్రతికూల ప్రభావాలను వీలైనంతగా తగ్గించేందుకు అన్ని సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం రైతుల వెంటే ఉంటుందని, ఎల్‌నినో సవాళ్లను సమష్టిగా ఎదుర్కొని అన్నదాతలకు పూర్తి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!