Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయానికి చోటు లభించింది. ఈ గుర్తింపుతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం జలాశయం నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ సౌత్ రీజినల్ జాయింట్ సెక్రటరీ ఇలియాజర్.. శ్రీశైలం ఎమ్మెల్యేకు, ఇరిగేషన్ అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు.
దక్షిణాసియాలో మరే ప్రాజెక్టులోనూ లేని విధంగా శ్రీశైలం జలాశయంలో 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు కలిగిన గేట్లు ఉండటం ఈ గుర్తింపునకు ప్రత్యేకతగా నిలిచింది. జలాశయం నిర్మాణం, దాని సాంకేతిక సామర్థ్యం, వరదలను తట్టుకునే పటిష్టతకు ఈ ఘనత నిదర్శనంగా నిలుస్తోంది. 2009లో వచ్చిన భారీ వరదల సమయంలో శ్రీశైలం జలాశయం రికార్డు స్థాయిలో 25.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుని పటిష్టంగా నిలిచింది. ఆ సమయంలో జలాశయం ప్రదర్శించిన సామర్థ్యం, నిర్మాణ పటిష్టత దాని ప్రత్యేకతను చాటిచెప్పాయి. ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే ఆనాటి డ్యామ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్ల కృషిని కొనియాడారు. జలాశయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు లభించేలా కృషి చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు శ్రీశైలం జలాశయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
Mythri Movie Makers: మెగా ఫిల్మ్ స్టూడియో.. మైత్రీ మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!