T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- కెప్టెన్‌గా 200+ స్కోర్లు సాధించడంలో శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు
- శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్లు 37 సార్లు 200+ స్కోర్లు
- ఈ ఘనతను 133 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించిన అయ్యర్
- ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 331 ఇన్నింగ్స్‌ల్లో 36 సార్లు 200+ స్కోర్లు
- విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 193 ఇన్నింగ్స్‌ల్లో 29 సార్లు 200+ స్కోర్లు
- ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టిన శ్రేయస్ అయ్యర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 Captain Record: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా మరోసారి 200 పరుగుల మార్క్‌ను దాటింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో 200 ప్లస్ స్కోర్లు నమోదైన సంఖ్య 37కు చేరింది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీని అయ్యర్ వెనక్కి నెట్టాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్, దేశవాళీ టీ20 మ్యాచ్‌లను కలిపి చూస్తే.. కెప్టెన్‌గా అత్యధిక 200+ స్కోర్లు సాధించిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ అగ్రస్థానంలో నిలిచాడు. అయ్యర్ కెప్టెన్సీలో జట్లు 133 ఇన్నింగ్స్‌ల్లో 37 సార్లు 200 పరుగుల మార్క్‌ను దాటాయి. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 331 ఇన్నింగ్స్‌ల్లో 36 సార్లు 200 ప్లస్ స్కోరు నమోదైంది. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 193 ఇన్నింగ్స్‌ల్లో 29 సార్లు ఈ ఘనత సాధించారు.
Also Read
- Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
- Former CM Returns Bulletproof Vehicle: 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. ప్రభుత్వానికి తిరిగిచ్చిన మాజీ సీఎం!
- YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
- Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
కెప్టెన్‌గా అత్యధిక 200+ స్కోర్లు
* శ్రేయస్ అయ్యర్ – 37 సార్లు (133 ఇన్నింగ్స్‌లు)
* ఎంఎస్ ధోనీ – 36 సార్లు (331 ఇన్నింగ్స్‌లు)
* విరాట్ కోహ్లీ – 29 సార్లు (193 ఇన్నింగ్స్‌లు)
మూడో టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకానికి తోడు భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో వెస్టిండీస్‌పై 14 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. భారత్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 44 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా.. నామన్ ధీర్ 39 పరుగులకు రెండు వికెట్లు తీశాడు.
మూడో టీ20 విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుత భారత్ పర్యటనలో వెస్టిండీస్‌పై లక్ష్యాన్ని కాపాడుకుని టీమిండియా విజయం సాధించడం ఇదే తొలిసారి. సిరీస్‌లో అజేయ ఆధిక్యం సాధించాలంటే భారత్ హైదరాబాద్ లో జరిగే నాలుగో టీ20లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. మరోవైపు వెస్టిండీస్ నాలుగో మ్యాచ్‌లో గెలిస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి టీ20 నిర్ణయాత్మక పోరుగా మారనుంది.
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!