Rohit Sharma: మేం కాదు.. ప్రపంచకప్ అందుకోవడానికే అతనే పూర్తి అర్హుడు: రోహిత్
- విశ్వవిజేతగా భారత్
- ద్రవిడ్ ఎమోషనల్
- 2003లో టైటిల్ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Heap Praise on Rahul Dravid: 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరపడింది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి ఖాయం అనుకున్న దశలో అద్భుతంగా పోరాడింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్.. ఈసారి ట్రోఫీ సాధించి 140 కోట్ల భారతీయులను ఆనందాల్లో ముంచెత్తింది. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యారు.
గత 20–25 ఏళ్లుగా భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను ఆటగాళ్ల కంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రపంచకప్ ట్రోఫీ అందుకోవడానికి అసలైన అర్హుడు అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ… ‘మా (ప్లేయర్స్) కంటే ఎక్కువగా ప్రపంచకప్ ట్రోఫీకి రాహుల్ ద్రవిడే అర్హుడు. గత 20-25 ఏళ్లుగా అతను భారత క్రికెట్‌కు ఏం చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటి వరకు ద్రవిడ్ ఖాతాలో ప్రపంచకప్ ఒక్కటి మాత్రమే లేదు. ఇప్పుడు అది కూడా సంపూర్ణం అయ్యింది. ఇప్పుడు జట్టు సంతోషంగా ఉంది. అతను ఎంత గర్వంగా ఉన్నాడో, ఎంత ఉత్సాహంగా ఉన్నాడో మీరు చూస్తున్నారు. ద్రవిడ్ కోసం ట్రోఫీ సాధించిందుకు ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Rohit Sharma Robo Walk: రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న రోహిత్ శర్మ!
164 టెస్టులు, 344 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ ద్రవిడ్.. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఆటగాడిగా 2003లో తృటిలో వన్డే ప్రపంచకప్ టైటిల్ మిస్ అయింది. సారథిగా 2007 వన్డే ప్రపంచకప్‌లో విఫలమయ్యాడు. 2011లో భారత్ కప్ గెలిచినా.. అప్పటికే అతడు వీడ్కోలు పలికాడు. ఇక జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. రెండేళ్ల క్రితం భారత జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. ఎట్టకేలకు తన మార్గనిర్ధేశంలో జట్టుకు ట్రోఫీ అందించాడు. టీ20 ప్రపంచకప్ 2024తో ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!