Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి
- 1996 అక్టోబర్ 11న హీరోగా సినీ రంగ ప్రవేశం
- మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్
- తనదైన స్టైల్, మేనరిజంతో ‘పవర్ స్టార్’గా ప్రత్యేక గుర్తింపు
- ‘తొలిప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషి’ సినిమాలతో యువతలో భారీ క్రేజ్
- ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై.. తనదైన స్టైల్, మేనరిజంతో ‘పవర్ స్టార్’గా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 30 ఏళ్లు పూర్తయింది. మాస్ ఫాలోయింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ జర్నీ తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేకమని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 1996 అక్టోబర్ 11న ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణ్ బాబు.. అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. ‘తొలిప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి వరుస చిత్రాలతో యువతకు తిరుగులేని ఐకాన్‌గా మారారు. పవర్ ఫుల్ యాక్షన్‌తో పాటు డైలాగ్ డెలివరీలో పవన్ చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కేవలం నటుడిగానే కాకుండా.. ఆయన వేసుకునే దుస్తులు, వాడే బైక్.. ఇలా ప్రతి అంశం సరికొత్త ట్రెండ్‌గా మారి ‘పవనిజం’ అనే కొత్త విధానానికి ప్రాణం పోశాయి.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
గడచిన 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకోవడంతో పాటు కొన్ని పరాజయాలనూ ఎదుర్కొన్నారు. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా.. ఆయన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే వచ్చింది. ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి పరిశ్రమ హిట్లు బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామిన ఏంటో నిరూపించాయి. ఒకానొక దశలో పవన్ సినిమా విడుదలవుతుందంటే చాలు.. కంటెంట్‌తో నిమిత్తం లేకుండా థియేటర్లు దద్దరిల్లే స్థాయికి ఆయన క్రేజ్ ఉండేది. కేవలం నటుడిగానే కాకుండా ‘జానీ’ చిత్రంతో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విభాగాల్లోనూ తనదైన మార్క్ చూపించారు.
సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సమయంలోనే ప్రజాసేవ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒకవైపు రాజకీయ బాధ్యతల్లో నిమగ్నమై ఉంటూనే.. మరోవైపు ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించాడు. ఒక సాధారణ నటుడిగా ప్రయాణం ప్రారంభించి, కోట్ల మందికి ఆరాధ్యుడిగా, పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులోనూ సినిమాలు, ప్రజాసేవ రెండింటినీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!