CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుపతిని అద్భుతమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భక్తులకు ఉపయోగపడేలా రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక వాతావరణం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.2,750 కోట్లతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ తేదీని ముందుగానే నిర్ణయించుకుని, దానికి అనుగుణంగా పనులు ప్రారంభించాలని సూచించారు. కేవలం డబ్బుల కోసం కాకుండా, దేవుడిపై భక్తి, సేవాభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌లోనూ కనిపించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. తిరుపతిలో పవిత్రమైన వాతావరణం లేకపోతే మంచిది కాదన్నారు. నగరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ‘స్వర్గం అంటే ఇలాగే ఉంటుందా?’ అనే అనుభూతి కలిగేలా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలన్నారు. తిరుమలలో ఉన్నట్లుగానే తిరుపతిలోనూ పచ్చదనాన్ని పెంచాలని, నగరంలోని చెరువులను పరస్పరం అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, అక్కడ సుప్రభాతం వింటూ ప్రజలు వాకింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం పేర్కొన్నారు.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
టీటీడీ ఉద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా హౌస్సైట్ల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉద్యోగులకు ఉపయోగపడేలా ఆధునిక టౌన్‌షిప్‌ను నిర్మించాలని తెలిపారు. తిరుపతిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు స్థానికులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా గుణాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భక్తుల్లో దేవుడిపై విశ్వాసాన్ని పెంచడంతో పాటు గోవుల సేవకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవుడిపై భక్తి అంటే ప్రకృతిని కాపాడటమనే భావనను ప్రజల్లో పెంపొందించాలని చెప్పారు. ప్రకృతిని ఆరాధించే మనస్తత్వం అలవడినప్పుడే మనిషికి ప్రకృతితో నిజమైన అనుబంధం ఏర్పడుతుందని సీఎం పేర్కొన్నారు. దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరూ ట్రస్టీలుగానే వ్యవహరించాలని సీఎం వ్యాఖ్యానించారు. అహంకారాన్ని పక్కనపెట్టి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఆధ్యాత్మికతకు సాంకేతికతను జోడిస్తే ఒత్తిడి లేకుండా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!