IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్?.. కానీ 3 కండీషన్స్ పెట్టిన పాకిస్థాన్
- భారత్తో మ్యాచ్పై వెనక్కి తగ్గిన పాకిస్థాన్..
- ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఖవాజాతో మొహ్సిన్ నఖ్వీ భేటీ..
- నేడు పాక్ ప్రధానితో సమావేశం కానున్న పీసీబీ ఛైర్మన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: భారత్తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం నాడు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పై కొంతమంది పీసీబీ అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ, చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఇప్పటికీ సహకరించడం లేదని పేర్కొన్నాయి.
Read Also: Lawyers Fees Hike: కోర్టులో కేంద్రం తరపున వాదించే న్యాయవాదుల ఫీజులు పెంపు.. పూర్తి వివరాలు ఇవే
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
కాగా, ఈ నేపథ్యంలో ఈరోజు ( ఫిబ్రవరి 9న) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మరోసారి సమావేశమై చర్చలు జరపాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించారు. తుది నిర్ణయానికి ముందు ప్రధాని అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగనుంది. గత రెండు వారాల్లో ఇది రెండో అధికారిక సమావేశం కావడం గమనార్హం. ఫిబ్రవరి 15వ తేదీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also: Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా భారీ మైథలాజికల్ సినిమా ఫిక్స్
ఇదిలా ఉండగా, ఐసీసీతో ప్రతిష్టంభనను ముగించేందుకు పీసీబీ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం లాహోర్‌లో జరిగిన సమావేశంలో పీసీబీ ఈ డిమాండ్లను ఐసీసీ ముందుంచింది.
* బంగ్లాదేశ్‌కు పెరిగిన పరిహారం ఇవ్వడం,
* టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ బంగ్లాదేశ్‌కు పాల్గొనకుండా ఫీజు చెల్లించడం,
* భవిష్యత్తులో జరగనున్న ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్య హక్కులు కల్పించాలని తెలిపింది. కాగా, ఈ డిమాండ్లపై ఐసీసీ ఎలా స్పందిస్తుంది అనే దానిపై భారత్- పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉండనుంది.
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!