Babar Azam: గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam React on Pakistan Defeat vs India: టీమిండియాపై ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటంతోనే తాము మ్యాచ్‌ను కోల్పోయాం అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తెలిపాడు. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్స్ కోల్పోవడం కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ బాదాలనుకున్నాం అని, కానీ అది కుదరలేదని బాబర్ చెప్పాడు. ఇది తాము గెలవాల్సిన మ్యాచ్ అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 6 పరుగుల తేడాతో ఓడింది.
మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. ‘మేం బాగా బౌలింగ్ చేశాం. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడమే కాకుండా.. ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాం. ఇదే మాకు ప్రతికూలంగా మారింది. స్వల్ప ఛేదన కాబట్టి ప్రత్యేక ప్రణాళికలతో మేం బరిలోకి దిగలేదు. సింపుల్‌గా ఆడాలనుకున్నాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టాలనుకున్నాం. ఈ ప్రక్రియలో ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాం. ఇదే మా ఓటమికి కారణమైంది’ అని బాబర్ తెలిపాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Rohit Sharma: టాస్ కాయిన్ ఎక్కడ.. రోహిత్ శర్మ ఫన్నీ వీడియో!
‘ఛేదనలో టెయిలెండర్ల నుంచి పెద్దగా ఆశించలేదు. పవర్‌ప్లేను బాగా ఉపయోగించు కోవాలనుకున్నాం. కానీ ఓ వికెట్ పడగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి ఆరు ఓవర్లలో మా మార్క్‌ను చూపించలేకపోయాం. పిచ్ బాగుంది. బంతి చక్కగా వచ్చింది. కానీ పిచ్ కాస్త స్లోగా ఉంది. కొన్ని బంతులు ఎక్స్‌ట్రా బౌన్స్ అయ్యాయి. సూపర్ 8 చేరుకోవాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. మా తప్పుల గురించి విశ్లేషించుకుంటాం. చివరి మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను’ అని బాబర్ ఆజమ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!