Rohit Sharma forgets toss coin in his pocket During IND vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. టాస్ కాయిన్‌ను జేబులోనే పెట్టుకున్న రోహిత్.. ఆ విషయాన్ని మర్చిపోయాడు. రవిశాస్త్రి టాస్ చేయమని కోరగా.. కాయిన్ ఎక్కడ ఉంది రవి భాయ్? అంటూ ప్రశ్నించాడు. రోహిత్ తన జేబును చెక్ చేయగా.. కాయిన్ అందులోనే ఉంది. దీంతో రోహిత్‌తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరదాగా నవ్వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: IND vs PAK: టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. కేవలం 120 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని.. దాయాది దేశంపై తన జైత్రయాత్రను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ ఐడిని. రిషబ్ పంత్ (42; 31 బంతుల్లో 6×4) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) అదరగొట్టారు. ప్రతికూల పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రా (3/14) గొప్ప బౌలింగ్ ప్రదర్శనకు తోడు హార్దిక్ పాండ్యా (2/24) రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 113/7కు పరిమితమైంది. మహ్మద్ రిజ్వాన్ (31; 44 బంతుల్లో 1×4, 1×6) మినహా అందరూ తేలిపోయారు.