IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NAM: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న గ్రూప్-A మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నమీబియాకు భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.దీనితో నమీబియా గెలవాలంటే 210 పరుగులు చేయాలి.
Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తనదైన దూకుడును చూపించాడు. కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 254.16 స్ట్రైక్‌రేట్ తో 61 పరుగులు చేసి నమీబియా బౌలర్లకు ఊచకోత అంటే ఏంటో రుచి చూపించాడు. ఇక ఇషాన్‌కు తోడుగా సంజు శాంసన్ కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి వేగాన్ని మరింత పెంచాడు. మొదటి రెండు ఓవర్లలోనే భారత్ 25 పరుగులు మంచి ప్రారంభం అందుకుంది.
చివర్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. కేవలం 28 బంతుల్లో 52 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను 200 దాటించాడు. శివమ్ దూబే 23 పరుగులతో సహకరించాడు. తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (12) త్వరగా ఔటవడంతో భారత్ రన్‌రేట్ కాస్త తగ్గింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 41 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు కోల్పోయింది. దీనితో స్కోర్ వేగం మందగించింది.
Ragi Ambali Recipe: ఎండకాలం వచ్చేస్తుంది.. ఉపశమనం కోసం ‘రాగి అంబలి’! చేసేయండి ఇలా!
నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేశాడు. 4 ఓవర్లలో 20 పరుగులకే 4 కీలక వికెట్లు తీసి బ్యాటర్లను కంట్రోల్ చేశాడు. ఇక షికోంగో, జేజే స్మిట్, బెర్నార్డ్ స్కోల్ట్జ్ లు తలో వికెట్ సాధించారు.
Innings Break!
On the back of a powerful batting show, #TeamIndia set a target of 2⃣1⃣0⃣ 🎯
Over to our bowlers 👉
Scorecard ▶️ https://t.co/SQLoaZjq98#T20WorldCup | #MenInBlue | #INDvNAM pic.twitter.com/uDOZ70cUvP
— BCCI (@BCCI) February 12, 2026
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!