Rashmika Mandanna : టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది.గత ఏడాది ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది.ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రశంసలు దక్కాయి.
Read Also :Thandel : వాస్తవ ఘటనల ఆధారంగా నాగచైతన్య ‘తండేల్’..
ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ “సికిందర్” అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న “NTR31 ” మూవీలో రష్మిక ఎంపికైనట్లు సమాచారం.తాజాగా ఈ ఆఫర్ కు రష్మిక ఓకే చెప్పినట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది.