Rohit Sharma-Fan: ప్లీజ్ ఏమనొద్దు.. పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్ (వీడియో)!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fan hugged Rohit Sharma in IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం న్యూయార్క్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు దూసుకొచ్చిన ఆ అభిమాని.. హిట్‌మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. రోహిత్ కూడా అతడిని ఏమీ అనకుండా ఉండిపోయాడు. అయితే అంతలోనే పోలీసులు అప్రమత్తమై అభిమానిని పట్టుకున్నారు.
Also Read: Virat Kohli-ICC: ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
మైదానంలోకి దూసుకొచ్చి సదరు అభిమానిని అమెరికా పోలీసులు నేలపై పడుకోబెట్టి కాస్త కఠినంగా ప్రవర్తించారు. రోహిత్ శర్మ వద్దని చెబుతున్నా.. వారు వినిపించుకోలేదు. ఇంతలో మ్యాచ్ నిర్వాహకుల్లోని ఒకరు వచ్చి రోహిత్ రిక్వెస్ట్‌ను పోలీసులకు చెప్పగా.. అతడిని పైకి లేపి మైదానం బయటకు తీసుకెళ్లారు. అభిమాని ఏమనొద్దని పోలీసులకు రోహిత్ రిక్వెస్ట్ చేశాడట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానిని రక్షించేందుకు రోహిత్ చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. రోహిత్ సూపర్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ తమ అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటారన్న విషయం తెలిసిందే.
The fan who breached the field and hugged Rohit Sharma was taken down by the USA police.
– Rohit requested the officers to go easy on them. pic.twitter.com/MWWCNeF3U2
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!