Hardik Pandya: సులువుగా వదిలిపెట్టను.. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya on Problems: ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా విఫలం, టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు, విడాకుల రూమర్లు.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుసగా చుట్టుముట్టాయి. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ అనంతరం అన్నింటిని పక్కనపెట్టి లండన్ వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు. తాజాగా భారత జట్టుతో కలిసిన హార్దిక్.. బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ గత కొన్ని నెలలుగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. ఏ సమస్యను సులువుగా వదిలిపెట్టనని, చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా అని తెలిపాడు.
‘జీవితం అనే యుద్ధంలో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. జీవితం లేదా మైదానంలో కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని సులువుగా వదిలేస్తే అనుకున్న ఫలితాన్ని సాధించలేం. ఇలాంటివి ఎదుర్కోవడం కష్టమని నాకు తెలుసు. అయితే వాటన్నింటిని దాటుకొని ముందుకు సాగడంపైనే దృష్టి పెడతా. గతంలో నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు ఎలాంటి విధానం అనుసరించానో.. ఇప్పుడూ అలాగే ప్రయత్నిస్తా. పోరాడుతూ ఉంటే పరిస్థితుల్లో మార్పు వస్తుంది’ అని హార్దిక్ పాండ్యా చెప్పాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Venkatesh Iyer Marriage: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ వైరల్!
‘జీవితం మొత్తం చెడు రోజులే ఉండవు. మంచి రోజులూ కూడా ఉంటాయి. క్లిష్ట దశలను దాటి ముందుకు వెళ్తుండాలి. నా జీవితంలో ఇలాంటి క్లిష్ట దశలను ఎన్నోసార్లు అనుభవించా. వాటి నుంచి బయటకు వచ్చా. విజయం వచ్చినపుడు ఎక్కువ సీరియస్‌గా తీసుకోను. తర్వాత ఏం చేయాలనేదానిపైనే దృష్టిపెడతా. కష్ట సమయాల్లోనూ ఇలానే ఆలోచిస్తా. ఎప్పుడూ సమస్యల నుంచి పారిపోవాలని చూడను. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా. త్వరలోనే అన్ని అనుకూలంగా మారుతాయి’ అని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 హార్దిక్ కీలకం కానున్నాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!