Team India: నేటి రాత్రికి భారత్‌కు టీమిండియా ప్లేయర్స్..
- నేటి అర్థరాత్రి వరకు భారత్ కు టీమిండియా ప్లేయర్స్..
- ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ ను ఏర్పాటు చేసిన బీసీసీఐ..
- రేపు ప్రధాని నరేంద్ర మోడీతో ఇండియన్ క్రికెట్ టీమ్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా క్రికెట్ జట్టు ఈరోజు అర్థరాత్రి వరకు భారతదేశానికి చేరుకోనుంది. ఇండియాకు వచ్చిన తర్వాత టీమిండియా క్రికెట్ బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత, 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబైలో భారత జట్టు ప్లేయర్లు ఓపెన్ బస్సులో పరేడ్ చేయనున్నట్లు సమాచారం. ఇక, టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ రెండోసారి గెలుచుకుంది. 2007లో టైటిల్‌ను గెలుచుకున్న టీమ్.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024లో టైటిల్‌ను సాధించింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలిచినప్పుడు.. మొత్తం జట్టును ఓపెన్ బస్సులో ముంబై నగరంలో తిప్పారు. ఆ సమయంలో వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ వారికి ఆపూర్వ మద్దతు ఇచ్చారు.
Read Also: Minister Kandula Durgesh: టూరిజం రంగానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్.. మరొకరు అవసరంలేదు..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ముంబైలో ఓపెన్ బస్సులో టీమిండియా ప్లేయర్స్ చక్కర్లు కొట్టనున్నారు అని సమాచారం. అయితే, బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా.. రోహిత్ సేన అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడింది. తుఫాన్ ఎఫెక్ట్ తో బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడ చిక్కుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు, వారి కుటుంబాలు భారతదేశానికి తిరిగి ఈరోజు అర్థరాత్రి 1 గంట తర్వాత చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత బృందం రేపు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలివనున్నారు.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!