SA vs AFG: పరిస్థితులు అనుకూలించలేదు.. ఓటమిని అంగీకరిస్తున్నాం: రషీద్ ఖాన్
- దక్షిణాఫ్రికా చేతిలో అఫ్గాన్ చిత్తు
- పరిస్థితులు అనుకూలించలేదు
- ప్రారంభం మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Khan on Afghanistan Defeat vs South Africa in T20 World Cup 2024: ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అఫ్గానిస్థాన్ సారథి రషీద్ ఖాన్ తెలిపాడు. పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలించలేదని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నాడు. ఇది తమకు ప్రారంభం మాత్రమే అని, ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయన్నాడు. మరింత హార్డ్‌వర్క్ చేసి మున్ముందు సిరీస్‌లకు సిద్ధమవుతాం అని రషీద్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అఫ్గాన్ చిత్తుచిత్తుగా ఓడింది.
మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ… ‘ఈ ఓటమిని జీర్ణించుకోవడం జట్టుగా చాలా కష్టం. మేం అనుకున్నది చేయడానికి పరిస్థితులు అనుకూలించలేదు. మంచి ప్రదర్శన చేయాల్సి ఉన్నప్పటికీ.. పిచ్ అనుకూలించలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అదే టీ20 క్రికెట్. దక్షిణాఫ్రికా బాగా బౌలింగ్ చేసింది. ఈ టోర్నమెంట్‌లో మేము మంచి విజయాలు సాధించామని అనుకుంటున్నాను. మా సీమర్లు బాగా బౌలింగ్ చేసారు’ అని తెలిపాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: SA vs AFG: తొలిసారిగా ఫైనల్‌కు చేరడం సంతోషం.. ఫైనల్ కోసం భయపడటం లేదు: మార్‌క్రమ్
‘ఎపుడైనా మంచి ఆరంభాలు కావాలి. ఈ మ్యాచ్‌లో మేం శుభారంభం అందుకోలేదు. ముజీబ్ గాయపడటం మాకు దురదృష్టమే. మా పేసర్లతో పాటు మొహ్మద్ నబీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లుగా మా పనిని పేసర్లు సులభతరం చేశారు. ఈ టోర్నీని మేం ఆస్వాదించాం. ప్రొటీస్ వంటి అగ్రశ్రేణి జట్టుపై ఓడిపోవడాన్ని అంగీకరిస్తున్నాం. మెగా టోర్నీలలో మాకు ప్రారంభం మాత్రమే. ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయి. మా ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. మా నైపుణ్యాలను ఉపయోగించడంలో ఎక్కడ విఫలమయ్యామో గుర్తించి సరిదిద్దుకుంటాం. మిడిలార్డర్‌లో మేం మెరుగుపడాల్సి ఉంది. మరింత హార్డ్‌వర్క్ చేసి వచ్చే సిరీస్‌లకు సిద్ధమవుతాం’ అని రషీద్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!