వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో శ్రీలంక విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ-20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం సాధించాయి. బంగ్లాపై భారీ విజయంతో మరోసారి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది ఆసీస్. వరుసగా ఐదు ఓటమితో బంగ్లా పులులు టోర్నీ నుంచి నిష్ర్కమించారు.బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో అస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా ధాటికి బంగ్లా హడలెత్తిపోయింది. 19 పరుగులు ఇచ్చిన జంపా 5 వికెట్లు తీసి బంగ్లా ఓటమిని శాసించాడు.
ఆ తరువాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం 6.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌తో సునాయాసంగా గెలుపొందింది. కీలకమైన నెట్ రన్‌రేట్‌ను పెంచుకుంది. బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సూపర్ 12 గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా పోటీ పడుతున్నాయి.
Also Read
- T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
అయితే ఉత్తమ రన్‌రేట్‌తో ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంది.మరోవైపు టీ-20 ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. వెస్టిండీస్‌ను 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక.. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆ తరువాత వెస్టిండీస్ టార్గెట్ ఛేజింగ్‌లో విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓటమి పాలైంది.శ్రీలంక జట్టుకు ఇదే చివరి మ్యాచ్. మొదటి దశలో శ్రీలంకకు కేవలం రెండు విజయాలే దక్కాయి. దీంతో ఆ జట్టు ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్ కూడా ఈ ఓటమితో టీ-20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.
తాజావార్తలు
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
-
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!