Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!
- సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది
- బుమ్రా, హార్దిక్, అక్షర్ జట్టుకు వెన్నెముక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Praises Sanju Samson: టీ20 ప్రపంచ కప్ 2026 విజయం అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రయాణం, సహచర ఆటగాళ్ల పాత్ర, కోచ్ మార్గదర్శకతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా టీమిండియా కొత్త దిశలో ముందుకు సాగుతోందని తెలిపాడు. ఈ ప్రయాణం ఒక్కసారిగా వచ్చిన విజయమేమీ కాదని, దీని వెనుక చాలా కాలంగా పడిన కష్టం ఉందని చెప్పాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా తనపై ఉంచిన నమ్మకమే భారత జట్టును కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లిందని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉన్నాను. ఇది సుదీర్ఘ ప్రయాణం. 2024 ప్రపంచ కప్ తర్వాత జట్టులో వచ్చిన మార్పులే ఈ విజయానికి కారణం. ఆ సమయంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా నాపై నమ్మకం ఉంచారు. జై షా సహా రోహిత్ (శర్మ) భాయ్, మిగతా జట్టు సభ్యులు అందరూ నాపై విశ్వాసం ఉంచి.. జట్టుకు నాయకత్వం వహించడానికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకమే జట్టును కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లింది. ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియంలో బిగ్ విక్టరీ అందుకున్నాము. ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి. భారత జట్టుకు సారథ్యం వహించడం, ప్రపంచ కప్ అందించడం నా జీవితంలో చాలా ప్రత్యేకం. ఈ క్షణాలను ఎప్పటికీ అమర్చిపోలేను’ అని తెలిపాడు.
Also Read
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
- ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
Also Read: Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!
వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ గురించి మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘సంజు శాంసన్ జట్టులోకి రావడానికి ఇదే సరైన సమయమని భావించాం. సంజూ తన ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. వరుసగా మూడు కీలక మ్యాచులలో బ్యాట్ జులిపించాడు. అతడు అద్భుత ఆటగాడు. సంజు రాకతో అంతా మారిపోయింది. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలు తమ ప్రతిభను నిరూపిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. జట్టులో సీనియర్ ఆటగాళ్ల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు జట్టుకు వెన్నెముక లాంటి వారు. జట్టుకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వీరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఇక కోచ్ గౌతమ్ గంభీర్ అద్భుతం. గంభీర్‌కు జట్టుకు ఏమి అవసరం, ఎలా చేయాలి అన్నది బాగా తెలుసు. ఆయన మార్గదర్శకతలో టీమిండియా మరింత బలంగా మారుతుంది’ అని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!