FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ మరోసారి తన క్లాస్‌ను ఆట తీరును చూపించింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2-1 తేడాతో గెలిచిన లా రొజా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి నిమిషాల్లో మికెల్ మెరినో గోల్‌తో స్పెయిన్ విజయం ఖాయం చేసుకుంది. ఇప్పటికే ఓసారి పోర్చుగల్‌పై కూడా ఇలాంటి కీలక సమయంలో గోల్ చేసి గెలిపించిన మెరినో.. మరోసారి నాకౌట్ హీరోగా నిలిచాడు.
మ్యాచ్ ప్రారంభం నుంచే స్పెయిన్ ఆధిపత్యం ప్రదర్శించింది. 30వ నిమిషంలో ఫాబియన్ రుయిజ్ గోల్‌తో స్పెయిన్ ముందంజలోకి వెళ్లింది. అయితే బెల్జియం వెంటనే జవాబు ఇచ్చింది. 41వ నిమిషంలో చార్లెస్ డి కెటెలారే గోల్ చేసి స్కోర్‌ను 1-1గా సమం చేశాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌పై నమోదైన తొలి గోల్ ఇదే. రెండో అర్థభాగంలో ఇరుజట్లు గట్టిగా పోరాడినా గోల్ మాత్రం దొరకలేదు. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లేలా కనిపించిన సమయానికి 88వ నిమిషంలో ఆట అనుకోని మలుపు తిరిగింది. పౌ కుబార్సీ దూరం నుంచి కొట్టిన షాట్‌ను బెల్జియం గోల్‌కీపర్ సెన్నే లామెన్స్ సరిగా అడ్డుకోలేకపోయాడు. రీబౌండ్‌గా వచ్చిన బంతిని మెరినో చాకచక్యంగా నెట్లోకి పంపి స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు. యువ సంచలనం లామిన్ యమాల్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ విజయంతో స్పెయిన్ తమ అజేయ పరంపరను 36 మ్యాచ్‌లకు పెంచుకుంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ గెలవగల జట్టుగా స్పెయిన్ మరింత బలంగా మారుతోంది. సరైన సమయానికి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఈ జట్టు ప్రత్యేకతగా మారింది. ఇక సెమీఫైనల్లో స్పెయిన్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. కైలియన్ ఎంబాపే నేతృత్వంలోని ఫ్రాన్స్‌తో స్పెయిన్ తలపడనుంది. ఇప్పటికే వరుసగా రెండు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకున్న ఫ్రాన్స్ బలమైన జట్టు. అయితే స్పెయిన్ కూడా పూర్తి స్థాయి ప్రదర్శనతో సెమీస్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్ ఫైనల్‌కు సరిసమానంగా మారనుంది.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..