Suryakumar Yadav: మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం.. మా ప్రణాళిక బెడిసికొట్టింది!
- 50 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్
- ఓటమిపై స్పందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
- మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో నాలుగో టీ20లో తమ్మల్ని తామే పరీక్షించుకున్నాం అని చెప్పాడు. త్వరగా వికెట్స్ పడిపోతే.. ఒత్తిడిలో బ్యాటర్లు ఎలా ఆడుతారో తెలుసుకోవాలనుకున్నాం అని తెలిపాడు. ఫలితం కంటే జట్టు సంసిద్ధతకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించాడు. టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌ను ఓ పరీక్షగా వాడుకున్నామని సూర్యకుమార్ చెప్పాడు.
‘మ్యాచ్‌లో ఆరు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు బౌలర్లు ఉండాలన్నది జట్టు వ్యూహం. 180 లేదా 200 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో రెండు లేదా మూడు వికెట్లు త్వరగా పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం. అలాగేవ రల్డ్‌కప్ స్క్వాడ్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలనుకున్నాం. మెగా టోర్నీ ముందు ప్రతి ఆటగాడి పాత్ర, సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం ఎంతో కీలకం. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు జట్టు బాగా ఆడుతోంది. కాబట్టి ఈసారి ఛేదనలో పరీక్షించుకోవాలనుకున్నాం. భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో చూడాలన్నదే మా ఆలోచన. వచ్చే మ్యాచ్‌లో ఛేజింగ్ అవకాశం వస్తే తప్పక గెలుస్తాం’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
Also Read
- Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
- WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
- Tilak Varma: తిలక్ వర్మకు షాక్ తప్పదా..? రిప్లేస్ చేసేందుకు రెడీగా రజత్ పాటిదార్..
- ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం... 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?
Also Read: Fastest Fifty Record: శివమ్ దూబే ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ రికార్డ్స్ ఇవే!
మ్యాచ్ పరిస్థితులపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భారీ డ్యూ ప్రభావం ఉన్నా ఒకటి రెండు కీలక భాగస్వామ్యాలు ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే ఆడిన విధానం ప్రశంసనీయమని, అతనితో పాటు మరో బ్యాటర్ క్రీజులో నిలబడి ఉంటే విజయం సాధించేవాళ్ళం అని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను ఓటమిగా కాకుండా.. ఓ గొప్ప పాఠంగా తీసుకుంటున్నామని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. నాలుగో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?