Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Suryakumar Yadav Admits No Plan B Takes Blame For Indias T20 Loss

Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!

Published Date :December 12, 2025 , 8:12 am
By Sampath Kumar
  • రెండో టీ20 మ్యాచ్‌ ఓటమిపై స్పందించిన సూర్యకుమార్‌
  • బౌలింగ్‌లో మాకు ప్లాన్ బీ లేదు
  • భారత్ ఓటమికి నేనే బాధ్యుడిని
  • నేను, గిల్‌ బాధ్యత తీసుకుని ఆడాల్సింది
Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ ఓటమిపై భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని చెప్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, బ్యాటింగ్‌లో వైఫల్యమే తమ ఓటమిని శాసించిందన్నాడు. తాను, శుభ్‌మన్‌ గిల్‌ బాధ్యత తీసుకుని నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, బౌలింగ్‌లో ప్లాన్ బీ కూడా లేదని సూర్య చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20లో భారత్ 51 పరుగుల తేడాతో ఓడింది.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ… ‘మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ వికెట్‌ ఎలా స్పందిస్తుందన్న విషయంపై అప్పుడు పూర్తిగా అవగాహన లేదు. దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన లెంగ్త్‌లు చూసిన తర్వాత అసలు ప్లాన్‌ ఏంటో అర్థమైంది. డ్యూ కూడా కొంత ప్రభావం చూపింది. మొదటి ప్లాన్‌ పని చేయకపోతే.. రెండో ప్లాన్‌ అమలు చేయాల్సి ఉంటుంది. కానీ మాకు ప్లాన్ బీ లేదు. నేను, శుభ్‌మన్‌ మంచి స్టార్ట్ ఇవ్వాల్సింది. అభిషేక్‌ శర్మపై ఎక్కువగా ఆధారపడటం సరికాదు. అతడికి కూడా ఆఫ్‌-డే ఉండొచ్చు. ఈ మ్యాచ్‌లో గిల్‌ మొదటి బంతికే ఔట్‌ అయ్యాడు. అప్పుడు నేను బాధ్యత తీసుకోవాల్సింది. క్రీజులో నిలబడితే మ్యాచ్‌ను గెలిపించొచ్చు, కానీ ఆలా జరగలేదు’ అని అన్నాడు.

Also Read: Quinton de Kock History: క్వింటన్‌ డికాక్‌ సరికొత్త చరిత్ర.. టీమిండియాపైనే అత్యధికసార్లు..!

‘గత మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్ బాగా ఆడాడు. ఇటీవల టెస్టుల్లో కూడా బాగా బ్యాటింగ్‌ చేశాడు. అదే నమ్మకంతో ఈ మ్యాచ్‌లోనూ అతడిని బ్యాటింగ్‌లో ముందుకు పంపాం. దురదృష్టవశాత్తూ అది వర్కౌట్ కాలేదు. అయితే అక్షర్ బాగానే ఆడాడు. వచ్చే మ్యాచ్‌లో ఏం చేయాలన్నది కూర్చుని మాట్లాడుకుంటాం. ఈ మ్యాచ్‌ మాకు ఓ మంచి గుణపాఠం. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ చేసిన విధానం చూసి పాఠం నేర్చుకున్నాం. వచ్చే మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడతాం’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 4 బంతులు ఆడి 5 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs sa
  • IND vs SA 2nd T20
  • india vs south africa
  • Suryakumar Yadav
  • Suryakumar Yadav Comments

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions