Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ మరోసారి ఆరోపణలు చేశాడు. టాలీవుడ్లో మాఫియా తరహా వ్యవస్థ నడుస్తోందని.. చిన్న నిర్మాతలు, దర్శకులు అడుగడుగునా మోసం, దోపిడీ, వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపించాడు. తాను నిర్మించి, హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్లు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు బెదిరింపులు వస్తున్నప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని షిరాజ్ మెహదీ చెప్పాడు.
తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో షిరాజ్ మెహదీ మాట్లాడారు. ‘మంచి సాంకేతిక నిపుణులతో ఎంతో కష్టపడి ఓ అందాల రాక్షసి సినిమాను నిర్మించాము. మా చిత్రానికి తగినన్ని థియేటర్లు కేటాయించి, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే రికార్డులు సృష్టించే సత్తా ఉంది. సినిమా విడుదల సమయంలో థియేటర్లు దొరకకపోవడం చిన్న నిర్మాతలకు అతిపెద్ద సమస్యగా మారింది. పెద్ద సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ చిన్న చిత్రాలను పక్కన పెడుతున్నారు. ఈ సమస్యను పరిశ్రమ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే 40కి పైగా ప్రెస్మీట్లు నిర్వహించా, 50కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చాను’ అని వెల్లడించాడు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
డిజిటల్ ప్రొజెక్షన్, సినిమా విడుదల ప్రక్రియల పేరుతో చిన్న నిర్మాతలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని షిరాజ్ మెహదీ ఫైర్ అయ్యాడు. క్యూబ్, యూఎఫ్ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్ల వసూళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వారానికి సుమారు రూ.2,000తో పూర్తయ్యే పనికి ఒక్కో థియేటర్ నుంచి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం, ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్న చిన్న నిర్మాతలకు ఇలాంటి ఛార్జీలు మరింత భారంగా మారుతున్నాయని పేర్కొన్నాడు. ఐనాక్స్, పీవీఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు తొలుత థియేటర్లు కేటాయిస్తామని చెప్పి.. చివరి సమయంలో వెనక్కి తగ్గాయన్నాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే చట్టపరమైన నోటీసులు ఇచ్చామని, హైకోర్టు నుంచి సమన్లు కూడా వెళ్లాయని తెలిపాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓ అందాల రాక్షసి చిత్రాన్ని త్వరలోనే రీరిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని హీరో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!