Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shai Hope Praises Sherfane Rutherford and Roston Chase: భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ సంచలన విజయాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ముందుగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 252 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ షై హోప్ (102), రోవ్‌మన్ పావెల్ (24), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (84) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ హోప్ మాట్లాడుతూ.. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పదనుకున్నా అని చెప్పాడు. అయితే బౌలర్ రోస్టన్ చేజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి తమని మ్యాచ్‌లో నిలిపాడని, పావెల్ అద్భుతంగా ఆడాడని చెప్పుకొచ్చాడు.
కష్టాలు తప్పవని భావించా:
‘ఛేదన ప్రారంభంలోనే 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాలు తప్పవని భావించా. అయితే భారత్‌లో లక్ష్య ఛేదన చేస్తున్నప్పుడు ఎంతటి స్కోరు ఉన్నా మ్యాచ్‌లో నిలబడే అవకాశం ఉంటుందని మేము నమ్ముతాము. అయినప్పటికీ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడం మాత్రం మాకు పెద్ద సవాలుగా మారింది. నేను, రోవ్‌మన్ పావెల్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించిన తర్వాత జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇన్నింగ్స్‌కు మంచి ఊపు వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన వేగాన్ని అందించి, విజయానికి చేరువ కావడానికి దోహదపడ్డాడు’ అని షై హోప్ తెలిపాడు.
Also Read
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
భాగస్వామ్యాల్లో కీలకం:
‘క్రికెట్లో భాగస్వామ్యాల్లో బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతాను. అప్పుడప్పుడు ఈ విషయంలో మేం వెనుకబడుతుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మన భాగస్వామి షాట్లు ఆడుతుంటే మనం సంయమనంతో ఉండి అతడికి అవకాశం ఇవ్వాలి. ఒక బ్యాటర్ దూకుడుగా ఆడుతున్నప్పుడు మరో బ్యాటర్ అనవసరమైన రిస్కులు తీసుకోకుండా సహకరించడం ముఖ్యం. ఆ సమయంలో మ్యాచ్‌కు అవసరమైన రన్‌రేట్‌ను కొనసాగించగలిగితే చాలు. అనవసరమైన రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మేం బాగానే ఆడుతున్నామని అనిపించింది. అందుకే లక్ష్యాన్ని ఎలా ఛేదించాలనే విషయంపై సరైన అంచనాతో ముందుకు సాగాం’ అని హోప్ చెప్పుకొచ్చాడు.
రోస్టన్ చేజ్ అద్భుతం:
బౌలర్ రోస్టన్ చేజ్‌ను షై హోప్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం గొప్ప విషయమని ప్రశంసించాడు. ‘రోస్టన్ చేజ్ అద్భుతం. ఇలాంటి పిచ్, మైదానంలో ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున మాత్రమే ఇవ్వడం గొప్ప విషయం. అతడు తన బౌలింగ్‌తో మమ్మల్ని మ్యాచ్‌లో నిలిపాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ అతడు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి స్కోరును నియంత్రించాడు. దాంతో లక్ష్య ఛేదనలో మాకు పని కొంత సులభమైంది’ అని హోప్ వివరించాడు. రెండో టీ20లో చేజ్ తన నాలుగు ఓవర్లలో 24 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!