Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Sarpanch Candidate Promises: ఏ ఎన్నికల్లో అయినా గెలవాలంటే.. అభ్యర్థులను హామీలతో ఆకట్టుకోవాలి.. అండగా ఉంటాను అంటూ భరోసా కల్పించాలి.. సౌకర్యాలు కల్పిస్తానని నమ్మించాలి.. అయితే, ఇప్పుడు రాజస్థాన్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీలు ఇస్తుంటారు. అయితే, ఝున్ఝును జిల్లాలోని ఝాఝర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనితా సైని మాత్రం అందుకు భిన్నంగా ఓ వినూత్న హామీ ఇచ్చి వార్తల్లో నిలిచారు. గ్రామంలోని పెళ్లికాని యువకులకు వివాహాలు కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పెళ్లికాని యువకులకు పెళ్లిళ్లు చేయిస్తా!
తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో పెళ్లికాని యువకులకు వివాహాలు కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అనితా సైని తెలిపారు. గ్రామంలోనే వధువులు దొరకని పరిస్థితి ఉంటే, ఇతర గ్రామాలకు వెళ్లి అయినా పెళ్లికూతుళ్లను వెతికేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. యువకులకు తగిన జీవిత భాగస్వాములను గుర్తించి, వారి వివాహాలు జరిపించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఆమె ఎన్నికల ప్రచారం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది.
Also Read
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
పెళ్లి ఊరేగింపు కోసం రైలును ఏర్పాటు చేస్తా!
అనితా సైని తన హామీల్లో మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. అవసరమైతే పెళ్లి ఊరేగింపు కోసం రైలును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థుల మధ్య, వివాహాలు కుదిర్చే అంశాన్ని తన ప్రధాన హామీల్లో ఒకటిగా ప్రస్తావించడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
రాజస్థాన్, హర్యానాలో వివాహ సంక్షోభంపై చర్చ
రాజస్థాన్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో యువకులు వివాహాల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తరచూ చర్చకు వస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వివాహాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువస్తున్నట్లు గతంలో నివేదికలు వెలువడ్డాయి. అదే సమయంలో మహిళల అక్రమ రవాణా, దోపిడీకి సంబంధించిన తీవ్రమైన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పెళ్లికాని యువకులకు వివాహాలు కుదిర్చేందుకు కృషి చేస్తానన్న అనితా సైని హామీ చర్చనీయాంశమైంది. అయితే, వివాహాల పేరుతో మహిళల హక్కులకు భంగం కలగకుండా, వారి స్వచ్ఛంద అంగీకారం మరియు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత కీలకం.
హామీని ఎలా అమలు చేస్తారన్నదానిపై ఆసక్తి
అనితా సైని ఇచ్చిన ఈ విలక్షణమైన ఎన్నికల హామీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా విస్తృతంగా చర్చకు వచ్చింది. ఆమె ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ హామీని ఎలా అమలు చేస్తారు? పెళ్లికాని యువకులకు వివాహాలు కుదిర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ హామీ అమలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతానికి, ఝున్ఝును జిల్లాలోని ఝాఝర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చేసిన ఈ ప్రకటన రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!