టీ20 ప్రపంచకప్‌లో ఖాతా తెరిచిన దక్షిణాఫ్రికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ఓపెనర్ లూయిస్ (56) హాఫ్ సెంచరీతో రాణించినా.. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ పొలార్డ్ (26), సిమ్మన్స్ (16) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీశాడు. రబాడ, నార్జే తలో వికెట్ సాధించారు.
Read Also: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న ద్రవిడ్
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
అనంతరం 144 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీ జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బవుమా రెండు పరుగులకే రనౌట్‌గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్, వాండర్ డసేన్ (43) జాగ్రత్తగా ఆడారు. హెండ్రిక్స్ అవుటైనా మార్‌క్రమ్ (51) హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆండీ రసెల్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. విండీస్ బౌలర్లలో హెసోయిన్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా ఇది వెస్టిండీస్ జట్టుకు వరుసగా రెండో పరాజయం. తొలి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది.
తాజావార్తలు
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!