Niharika Reddy Released On Bail In Naveen Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో.. అతని మాజీ ప్రియురాలు, స్నేహితురాలు, A3 నిందితురాలు అయిన నిహారిక రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యింది. శనివారం రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. ఆమె చర్లపల్ల జైలు నుండి విడుదలైంది. ఇక ఈ కేసులో A1, A2 నిందితులుగా ఉన్న హరిహరకృష్ణ (ఇంటర్ నుండి నవీన్‌కి స్నేహితుడు), హసన్‌లు జైలులోనే ఉన్నారు.
Akhil Akkineni: మరోసారి ప్రేమలో పడ్డ అఖిల్.. అంతమాట అనేశాడేంటి..?
కాగా.. నిహారిక ప్రేమ కోసం తన స్నేహితుడైన నవీన్‌ను హరికృష్ణ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 17న నవీన్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి, కత్తితో ఘోరంగా చంపాడు. అతని శరీర భాగాలకు తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను) కోశాడు. ఈ హత్యలో హరికృష్ణ స్నేహితుడు హసన్, నిహారిక రెడ్డి సహకరించారు. నవీన్‌ని హత్య చేసిన అనంతరం హసన్ ఇంటికి వెళ్లిన హరికృష్ణ.. ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిహారిక ఇంటికి వెళ్లి.. నవీన్‌ని హత్య చేసిన విషయం చెప్పాడు. ఆమె దగ్గర ఖర్చుల కోసం రూ.1500 తీసుకొని పారిపోయాడు. ఫిబ్రవరి 20న సాయంత్రం నిహారిక దగ్గరకు వెళ్లి, ఆమెను బైక్‌పై ఎక్కించుకుని, నవీన్‌ని చంపిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాడు. ఈ కేసులో దొరికిపోతానేమోనని.. ఫిబ్రవరి 21న హరికృష్ణ పారిపోయాడు.
Health: కోడళ్ల అనారోగ్యానికి అత్తలే కారణమట
24న హైదరాబాద్‌కి తిరిగొచ్చిన హరికృష్ణ.. హసన్ సహాయంతో నవీన్ శరీర భాగాలను తగులబెట్టాడు. అదే రోజు సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హరికృష్ణ లొంగిపోయాడు. మరోవైపు.. ఈ హత్య గురించి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ.. హసన్, నిహారికలు బయటపెట్టలేదు. ఆధారాల్ని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో.. ఆ ఇద్దరిని సైతం ఏ2, ఏ3 నిందితులుగా పోలీసులు ఈ హత్య కేసులో అరెస్ట్ చేశారు. హసన్, నిహారికలను హయత్‌నగర్ కోర్టులో హాజరు పరగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే.. ఈమధ్య నిహారిక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు ఆ బెయిల్‌ని మంజూరు చేయడం, ఆమె జైలు నుంచి విడుదల అవ్వడం జరిగింది.