సూపర్సోనిక్ స్కైడైవ్కు మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్గార్ట్నర్(56) కన్నుమూశాడు. ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదంలో మరణించాడు. 2012లో స్ట్రాటో ఆవరణ నుంచి ధ్వని అవరోధాన్ని బద్దలు కొట్టిన దిగ్గజ స్కైడైవర్‌గా ఫెలిక్స్ బామ్గార్ట్నర్ పేరుపొందాడు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం.. మెటా క్షమాపణ
దశాబ్దం క్రితం స్ట్రాటో ఆవరణలో 24 మైళ్ల దూరం దూకి.. ధ్వని వేగం కంటే వేగంగా పడిపోయిన తొలి స్కైడైవర్‌గా ఫెలిక్స్ బామ్గార్ట్నర్ గుర్తింపుపొందాడు. ఇటలీ తూర్పు తీరంలో గురువారం జరిగిన ప్రమాదంలో మరణించినట్లు నగర మేయర్ మాసిమిలియానో సియార్పెల్లా సోషల్ మీడియాలో ధృవీకరించారు. ఆయన మరణం బాధాకరం అన్నారు. పోర్టో సాంట్ ఎల్పిడియో నగరంలోని ఈత కొలను దగ్గర పారాగ్లైడర్ కూలిపోయిందని ఇటాలియన్ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar Reddy: శుభవార్త.. కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి!
2012లో బామ్గార్ట్నర్ భూమికి ఎత్తులో ఉన్నప్పుడు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూల్‌గా థంబ్స్-అప్ను చూపించాడు. నేలకు దగ్గరకు వచ్చినప్పుడు పారాచూట్‌ను యాక్టివేట్ వేసి.. ల్యాండ్ అయిన తర్వాత విజయంతో చేతులను ఊపాడు. ఈ దృశ్యాలు లక్షలాది మంది యూట్యూబ్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు.
గాల్లో ఉండగా బామ్గార్ట్నర్కు ఏదో ఆరోగ్య సమస్య వచ్చి ఉండొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఆ కారణంతోనే అకస్మాత్తుగా కిందపడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. 2012, అక్టోబర్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన సూట్ ధరించి భూమికి 24 మైళ్లు (38 కి.మీ) ఎత్తులో బెలూన్ నుంచి కిందకు దూకి.. గంటకు 690 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ధ్వని అవరోధాన్ని అధిగమించిన మొదటి స్కైడైవర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇక 1947, అక్టోబర్ 14న అమెరికన్ పైలట్ చక్ యేగర్ విమాన ప్రయాణం ధ్వని అవరోధాన్ని బద్ధలు కొట్టాడు. న్యూ మెక్సికోలోని రోస్వెల్ మీదుగా చారిత్రాత్మక జంప్ చేసి గంటకు 833 mph కంటే ఎక్కవ వేగంతో ప్రయాణించాడు.