టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు దిగలేదు. వెన్నెముక సంబంధిత సమస్యకు సర్జరీ చేయించుకోవాలని శ్రేయాస్ కు బీసీసీఐ సూచించింది. లండన్ లో లేదా మరో చోట అయ్యర్ కు సర్జరీ జరుగుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ సర్జరీ జరిగితే 6-7 నెలల పాటు అతడు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐపీఎల్ 2023తో పాటు వన్డే వరల్డ్ కప్ కు కూడా అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది.
Also Read : Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్. జీఎంఆర్‌తోపాటు మరింత మంది
ఏ ఆటగాడికైనా వరల్డ్ కప్ ఆడటం కల.. యువరాజ్ లాంటి ఆటగాడు క్యాన్సర్ తో పోరాడుతూనే 2011లో టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. అయ్యర్ కూడా ఎలాగైనా సరే వరల్డ్ కప్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాయి. సర్జరీ చేయించుకుంటే ప్రపంచకప్ కు దూరంగా ఉండిపోయే ప్రమాదం ఉండటంతో ఇప్పుడే సర్జరీ చేయించుకోవద్దని శ్రేయాస్ అయ్యర్ డిసైడయ్యాడు. వన్డే ప్రపంచకప్ ఆడటం కోసం బీసీసీఐ సలహాకు విరుద్దంగా నిర్ణయం తీసుకున్నాడు. అందుకే వెన్ను సమస్యను సరి చేసుకోవడానికి సర్జరీ చేయించుకోవాలన్న నేషనల్ క్రికెట్ అకాడమీ సూచనను అయ్యర్ తిరస్కరించాడు. వెన్ను నొప్పిని తగ్గించడం కోసం ఇటీవలే అయ్యర్ కు ఆరు ఇంజెక్షన్స్ ఇచ్చారు.
Also Read : Sridevi: ముగ్గురు చెల్లెళ్లతో అతిలోక సుందరి అరుదైన ఫోటో… అందరితో కలిసి నటించింది ‘అతనొక్కడే’
ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ డాక్టర్ల సలహాతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రసెంట్ శ్రేయాస్ ఆయుర్వేద చికిత్స పొందుతున్నాడు.. ఐపీఎల్ మొత్తానికి దూరం అవుతాడని భావించడతా.. సర్జరీ వాయిదా వేసుకోవడంతో ప్రీమియర్ లీగ్ తొలి అర్థ భాగానికి శ్రేయాస్ దూరమయ్యే అవకాశం ఉంది. వైద్య నిపుణుల సలహా మేరకు నొప్పి తగ్గడం కోసం అయ్యర్ ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత మెల్లగా ఎక్సర్ సైజులు ప్రారంభించనున్నాడు. అయ్యర్ ఇంతకు ముందు కూడా ఆయూర్వేద వైద్య విధానాన్ని ఆశ్రయించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు రిహాబిలిటేషన్ లో ఉన్న అయ్యర్.. ఆక్యుపంక్చర్ చికిత్స తీసుకున్నాడు. వెన్ను సమస్య కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు అయ్యర్ దూరం కానుండటంతో.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కొత్త కెప్టెన్ ను నియమించనుంది. నితీశ్ రాణా, టీమ్ సౌథీల్లో ఒకరు కెప్టెన్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.