Shikhar Dhawan: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan Creates New Record In IPL As Indian Player: ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతవరకూ ఏ ఒక్క భారత క్రికెటర్ ఇప్పటివరకూ సాధించని రికార్డ్‌ని తన సొంతం చేసుకున్నాడు. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో (86) శివాలెత్తిన శిఖర్‌కి ఇది ఐపీఎల్లో 48వ అర్థశతకం. దీంతో.. ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా అతడు రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. డేవిడ్ వార్నర్ మాత్రం 54 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ 45 అర్థశతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై శిఖర్ ధవన్‌కు ఇదో ఏడో హాఫ్ సెంచరీ. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 8 అర్థశతకాలు చేసి, ఆ జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం ప్రస్తుతం తాను ఏ జట్టు (పంజాబ్ కింగ్స్) తరఫున అయితే ఆడుతున్నాడో, గతంలో ఆ జట్టుపైనే ఏడు అర్థశతకాలు బాదాడు. ఇక ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
Actor Akanksha Dubey Case: భోజ్‌పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) అర్థశతకాలతో చెలరేగడం వల్లే.. పంజాబ్ కింగ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 7 వికెట్ల నష్టానికి 192 పరుగులకే చాపచుట్టేసింది. సంజూ శాంసన్ (42) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో హెట్మేయర్(38), ధ్రువ్ జురేల్ (32) మెరుపు ఇన్నింగ్స్‌లతో తమ జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ.. చివర్లో శామ్ కర్రన్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, 5 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. పంజాబ్ బౌలర్లలో నథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Vijay-Rashmika: రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్… ఒకే ఇంట్లో.. ఒకే రూమ్ లో..?
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!