Shardul Thakur Breaks 3 Records With His First Fifty: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఒకటే బౌండరీల మోత మోగించేశాడు. ఎటుపడితే అటు షాట్లు బాదుతూ.. మైదానంలో పరుగుల వరద పారించాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించి.. కష్టాల్లో ఉన్న తన జట్టుని భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్న అతగాడు.. ఐపీఎల్ చరిత్రలో తొలి అర్థసెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే అతడు మూడు రికార్డులను బద్దలు కొట్టాడు.
Ameesha Patel: బాలీవుడ్ నటికి షాక్.. పవన్ కల్యాణ్ హీరోయిన్ పై వారెంట్ జారీ

20 బంతుల్లోనే అర్థశతకం చేసి.. ఈ ఐపీఎల్ సీజన్‌లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా శార్దూల్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జాస్ బట్లర్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు శార్దూల్ 20 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించి, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్‌ని బట్లర్‌తో పంచుకున్నాడు. అనంతరం.. కేకేఆర్ తరఫున ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి, 50ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా శార్దూల్ మరో రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ ఘనతని ఆండ్రీ రసెల్ ఐదుసార్లు, పాట్ కమిన్స్ మూడుసార్లు, సాహా ఒకసారి సాధించగా.. ఇప్పుడు వారి సరసన శార్దూల్ చేరాడు. ఇక ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ శార్దూల్ చోటు సంపాదించాడు. ఇలా ఒక్క ఫిఫ్టీతోనే శార్దూల్ మూడు రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్నాడు.
Vakapalli Case: సంచలనం సృష్టించిన వాకపల్లి సామూహిక అత్యాచారం కేసు కొట్టివేత..
ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఓవరాల్‌గా 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతనికి ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఒక దశలో కేకేఆర్ 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆ జట్టు 150 స్కోరు చేయడం కూడా కష్టమేనని అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన శార్దూల్.. రింకూ సింగ్ (46)తో కలిసి ఆరో వికెట్‌కు 103 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించాడు. అతడు ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే కేకేఆర్ 200 పరుగుల మార్క్‌ని దాటింది.