Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!
- టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో తలపడనున్న భారత్, న్యూజిలాండ్
- సంజూ శాంసన్ అభిమానులకు ప్రత్యేక సందేశం
- అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Emotional Message to Fans: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అభిమానులకు ప్రత్యేక సందేశం ఇచ్చాడు. తన కెరీర్‌లో ఇదే అతిపెద్ద మ్యాచ్ అని పేర్కొంటూ.. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరాడు. అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తనకు ఎంతో ముఖ్యమంటూ సంజు భావోద్వేగం చెందాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి సంజూ శాంసన్ మాట్లాడుతూ… ‘నా కెరీర్‌లోనే అతిపెద్ద మ్యాచ్ ఆడేందుకు నేను అహ్మదాబాద్‌కు చేరుకున్నా. ఎప్పటిలాగే మీ ప్రేమ, పూర్తి మద్దతు నాకు కావాలి. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఫైనల్ మ్యాచ్‌లో నేను సెంచరీ చేసి టీమిండియాకు ప్రపంచ కప్ అందించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపాడు. సంజూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read
- IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
- Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
- ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
- Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
టీ20 వరల్డ్ కప్ 2026లో సంజు శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అవకాశం లేటుగా వచ్చినా.. రెండు చేతులా అందిపుచ్చుకుని పరుగుల వరద పారిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 97 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 42 బంతుల్లో 89 పరుగులు చేసి.. భారత జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 232 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సంజు సగటు 77.33గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 201.73గా ఉంది. ఇక ఫైనల్‌లో కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు.
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!