Australia Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా.. ఆదివారం నాడు మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా నాదల్ బాటలోనే నడిచింది. నాలుగో రౌండ్‌లో 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో స్వైటెక్ పరాజయం పాలైంది. తొలి సెట్ కోల్పోయిన స్వైటెక్.. రెండో సెట్‌లో అయినా పుంజుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆమె పేలవ…