RCB Won The Toss And Chose To Field: ఆదివారం డబుల్ ధమాకాలో భాగంగా.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు జట్టు.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో ముంబై జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లకు ఎంతో ఆదరణ ఉంది. ముంబై జట్టు రోహిత్ శర్మ నేతృత్వంలో ఇప్పటివరకు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ని సొంతం చేసుకోగా.. బెంగళూరు జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. దాంతో.. ఈ జట్టు కప్ కొట్టాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఎలాగైనా ఆర్సీబీ రాణించాలని ప్రార్థిస్తున్నారు. కేవలం ఆ జట్టు అభిమానులే కాదు.. ఇతర జట్టు అభిమానులు సైతం ఆర్సీబీ కప్ కొట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ముంబై, బెంగళూరు జట్లలో గొప్ప ఆటగాళ్లే ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ రెండు జట్లు చాలా పటిష్టమైనవి. అందుకే.. వీరి మధ్య పోరు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
SRH vs RR: రాజస్థాన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్