కరోనా కారణంగా మధ్యలో వాయిదా పడిన ఐపీఎల్ 2021 త్వరలోనే యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే ఇదే ఊపును సెకండ్ హాఫ్ లో కూడా ప్రదర్శించి ఐపీఎల్ టైటిల్ అందుకోవాలని అనుకుంటున్న ఆర్సీబీ జట్టుకు షాక్ తగిలింది. మిగిలిన ఐపీఎల్ 2021 సీజన్ కు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు.
అయితే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన సుందర్ ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న 5 టెస్టుల సిరీస్ కోసం అక్కడే ఉండిపోయాడు. కానీ ఈ టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గాయం బారిన పడిన సుందర్… సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ ఇంకా కూడా సుందర్ గాయం నుండి కోలుకోకపోవడంతో అతను ఐపీఎల్ కు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక సుందర్ ధుమరం కావడంతో అతని స్థానంలో బెంగాల్‌కు చెందిన ఆకాష్ దీప్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ఆర్సీబీ యాజమాన్యం.