Ravindra Jadeja Breaks Kapil Dev Record: గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. వచ్చి రాగానే దుమ్ముదులిపేస్తున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. తొలుత బౌలింగ్‌లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న జడేజా.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రప్ఫాడించేశాడు. బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లో నింపాదిగా బ్యాటింగ్ చేస్తూ.. అర్థశతకం చేశాడు. ఈ నేపథ్యంలోనే జడేజా అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు హాఫ్ సెంచరీ చేయడం.. జడేజాకు ఇది ఐదోసారి. ఇంతకుముందు కపిల్ దేవ్ నాలుగు సార్లు ఈ ఫీట్ అందుకోగా.. జడేజా ఐదోసారి ఆ ఫీట్ సాధించి, కపిల్ రికార్డ్‌ని చెరిపేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జడేజా కనబరుస్తున్న ప్రదర్శనతో అభిమానులు అతనికి ఫిదా అయిపోతున్నారు.
Jeera Water: జీరా వాటర్‌తో ఎన్నో లాభాలు.. ఆ సమస్యలకి చెక్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, భారత బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో చెలరేగిపోగా.. అశ్విన్ మూడు వికెట్లు, షమీ-సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Bichhagadu 2: డబ్బు ప్రపంచానికి హానికరం అంటున్న బిచ్చగాడు