Bichhagadu 2: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. తనకు మంచి హిట్ ను తీసుకొచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు విజయ్. బిచ్చగాడు సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ ఆంటోనినే.. బిచ్చగాడు 2 కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను విజయ్ భార్య ఫాతిమా..ఫాతిమా విజయ్ ఆంథోనీ విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన యాంటీ బికిలి పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ లో విజయ్ గాయాలపాలయ్యిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కోలుకున్న ఆయన తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు.
అహంకారంతో విడాకులు.. సింగిల్ గా ఉంటున్న హీరోయిన్లు
ఇక తాజగా ఈ సినిమా నుంచి ఒక ‘స్నీక్ పీక్ ట్రైలర్’ అంటూ సినిమా ఓపెనింగ్ సీన్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విలన్ దేవ్ గిల్ ఒక హోటల్ రూమ్ లో విషకరమైన సర్పానికి ఎలుకను ఆహారంగా వేస్తాడు.. ఇంకోపక్క ఎంతో ధనవంతుడైన ఒక వ్యక్తి మృతి చెందినట్లు చూపించాడు.. ఇక మెదడు మార్పిడి గురించి ఒక డాక్టర్ చెప్తుండడం.. దాన్ని దేవ్ గిల్ ఎంతో శ్రద్దగా వింటున్నట్లు చూపించారు. గుండె, కిడ్నీలు మార్చినట్లు మెదడును కూడా మారుస్తామని డాక్టర్ చెప్పడం.. అందుకు యాంకర్.. మంచివారి మెదడు అయితే పర్లేదు.. అదే హిట్లర్ లాంటి వారి మెదడు మారిస్తే ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది కదా అని అడగగానే ఒక క్షుద్ర దేవత విగ్రహం భీకర రూపంలో చూపిస్తూ టైటిల్ ను రివీల్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. ఇక తరువాత సీన్ దుబాయ్ లో ఓపెన్ చేసి ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సన్నీవేశాలను చూపించారు. అందులో నుంచి విజయ్ ఆంటోని దిగుతాడు అని అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ఒక అస్థిపంజరం బుర్రపై డబ్బు ప్రపంచానికి హానికరం అంటూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఒక్క వీడియోతోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు విజయ్.. ఈ సినిమాకు సంగీతం కూడా ఆయనే అందించడం విశేషం. మరి ఈ సినిమాతో ఈ హీరో కమ్ డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.