ఉదయం పూట ప్రతిరోజూ జీలకర్ర నీళ్లను తీసుకుంటే.. జీర్ణక్రియ బాగుంటుంది.
జీరా వాటర్ మెటబాలిజం పెంచి, కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా శరీర బరువు తగ్గుతుంది.
జీలకర్ర వాటర్‌లో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
జీలకర్రలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
బాడీని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో ఉండే చెడు వ్యర్థాలను బయటకు పంపుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్య, తలనొప్పి, వికారం, ఇతర జీర్ణ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందుతుంది.
జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగితే.. కాలేయ సమస్యలు దూరమవుతాయి.
జీలకర్రలో ఉండే విటమిన్-ఇ చర్మం ఆరోగ్యానికి సహకరిస్తుంది.
జీలకర్ర నీటిలో ఉండే క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, సెలీనియం వంటివి ముఖంపై ముడతల్ని మాయం చేస్తాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్‌కి వుంది.