టీ20 క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసి మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి ఆసియా బౌలర్‌గానూ రషీద్ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 24 ఏళ్ల వయసులోనే 500 వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన యంగెస్ట్ స్పిన్నర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. మొత్తంగా టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ రషీద్‌ఖాన్. ఈ జాబితాలో 614 వికెట్లతో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. కాగా, టీ20 క్రికెట్‌లో ఐదు వందల వికెట్లను అత్యంత వేగంగా తీసిన బౌలర్ కూడా రషీద్‌ఖాన్ కావడం గమనార్హం. 368 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఆఫ్ఘాన్ స్పిన్నర్ ఐదు వందల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం ప్రిటోరియా కాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20ల్లో 500 వికెట్ల ఘనతను రషీద్‌ఖాన్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చిన రషీద్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
Zomato: జొమాటో కీలక నిర్ణయం..ఇకపై ఆ సేవలు బంద్!
ఇకపోతే, టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో 474 వికెట్లతో విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ మూడో ప్లేస్‌లో ఉండగా ఇమ్రాన్ తాహిర్ (466), షకిబుల్ హసన్ (436) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో 298 వికెట్లతో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 16వ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎమ్ఐ కేప్‌టౌన్ టీమ్‌కు రషీద్‌ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సోమవారం ప్రిటోరియా కాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20లో 500 వికెట్ల ఘనతను రషీద్‌ఖాన్ అందుకున్నాడు.