IPL 2026 : 2025 సీజన్ ఐపీఎల్ ముగిసింది. ఆర్సీబీ 18 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఛాంపియన్ గా నిలిచింది. అయితే గడిచిన సీజన్ ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐపీఎల్ సీజన్లో భారీ మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను మార్చబోతున్నాయట. 18వ సీజన్ రాజస్థాన్ రాయల్స్ కు ఒక పీడకలగా మారింది.ఈ సీజన్ లో RR 14 మ్యాచ్ లు ఆడింది, అందులో 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది, 10 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ బ్యాడ్ స్టాట్స్ ని దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ యాజమాన్యం కెప్టెన్ ని మార్చబోతున్నట్లు తెలుస్తుంది.
Read Also : Rahul Ramakrishnan : డైరెక్టర్ గా మారుతున్న మరో స్టార్ కమెడియన్
సంజు సామ్సన్ 2021 నుండి ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2022లో తన కెప్టెన్సీలో ఆర్ ఆర్ ని ఫైనల్ వరకు నడిపించాడు. ఫైనల్లో గుజరాత్ చేతిలో ఓడి ఛాంపియన్ కాలేకపోయింది. గత సీజన్లో సంజు గాయం కారణంగా చాలా మ్యాచులు ఆడలేదు. పైగా శాంసన్ కూడా జట్టును వీడాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ ని మార్చడం పక్కాగా తెలుస్తుంది. 2024 సీజన్లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ అయ్యర్ ని అనూహ్యంగా వేలంలోకి వదిలేసింది. దీంతో అయ్యర్ పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ కాగా, కేకేఆర్ బాధ్యతలను అజింక్య రహానే చేపట్టాడు. రహానే అనుభవజ్ఞుడైన ఆటగాడు.
ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కెప్టెన్ గా జట్టును కాపాడుకోలేకపోయాడు. రహానే సారధ్యంలో కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోగా, 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ విధంగా కోల్‌కతా ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. రాబోయే వేలంలో కేకేఆర్, కెప్టెన్ మెటీరియల్ ని కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు జట్లు మినహా మిగతా ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను కొనసాగించవచ్చు.