Rahul Ramakrishnan : కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈయన.. ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇప్పటికే టిల్లు వేణు, ధన్ రాజ్ లాంటి వారు డైరెక్టర్లుగా మారిపోయారు. కొందరు సక్సెస్ అవుతుంటే.. ఇంకొందరు బోల్తా పడుతున్నారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఈ దారిలోకి రాబోతున్నాడు. తాజాగా ట్విట్టర్ లోపోస్టు పెట్టాడు. డైరెక్టర్ గా అడ్వెంచర్ సినిమా తీయబోతున్నానని.. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు వారి షో రీల్స్, రెజ్యూమ్స్ మెయిల్ ఐడీకి పంపించాలన్నాడు.
Read Also : Samantha : స్వేచ్ఛగా జీవించడమే నిజమైన సక్సెస్.. సమంత కామెంట్స్..
ఇంతకీ హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. డౌన్ నుంచి వచ్చిన రాహుల్.. కొత్త వారికే అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాత, బడ్జెట్ లాంటి విషయాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన రాహుల్.. మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా సాంగ్స్ రైటర్ గా కూడా పనిచేశాడు.
కొన్ని షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. అన్ని కేటగిరీలపై పట్టు ఉండటంతో ఇప్పుడు డైరెక్టర్ గా మారుతున్నట్టు కనిపిస్తోంది. మరి రాహుల్ సక్సెస్ అవుతాడా లేదంటే మిగతా కమెడియన్ల లాగా తిరిగి కామెడీ ట్రాక్ ఎక్కువతాడా అన్నది చూడాలి.
Read Also : OG First Single: OGకి వీరమల్లు దెబ్బ.. లేదంటేనా?